సూపర్‌స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు
Gautam Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే దీనికి కారణం ఆయన నటించిన సినిమా కాదు. గౌతమ్ సినిమాలకు ఇస్తున్న రేటింగ్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే 400కు పైగా సినిమాలు చూసిన గౌతమ్.. తనకు నచ్చిన సినిమాలకు, నచ్చని సినిమాలకు చాలా నిజాయితీగా రేటింగ్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ లెటర్ బాక్స్ లో చాలా సినిమాలకు రేటింగ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా గౌతమ్ తన తండ్రి మహేష్ బాబు సినిమాలకు కూడా ఎలాంటి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబు నటించిన పోకిరి, ఒక్కడు సినిమాలకు గౌతమ్ 5 స్టార్స్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నాయి. అందుకే వాటికి గౌతమ్ కూడా అత్యధిక రేటింగ్ ఇచ్చాడు. అయితే మహేష్ బాబు సినిమా కాబట్టి ప్రతి సినిమాకు ఎక్కువ రేటింగ్ ఇవ్వలేదు. బ్రహ్మోత్సవం సినిమాకు కేవలం 1 స్టార్ మాత్రమే ఇచ్చాడు. అలాగే వంశీ సినిమాకు 2 స్టార్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో గౌతమ్ సినిమా విషయంలో హీరో ఎవరు అనేది కాకుండా కంటెంట్ ఎలా ఉంది అనేదే చూస్తున్నాడని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇతర హీరోల సినిమాలకు కూడా గౌతమ్ ఇచ్చిన రేటింగ్స్ ఆసక్తికరంగానే ఉన్నాయి. బాహుబలి 2 సినిమాకు ఏకంగా 5 స్టార్స్ ఇచ్చాడు. అలాగే సీతారామం సినిమాకు 4.5 స్టార్స్ ఇచ్చాడు. ఈ సినిమాల్లో కథ, ఎమోషన్స్, మేకింగ్ తనకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సినిమాలకు మాత్రం గౌతమ్ ఇచ్చిన రేటింగ్స్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాయి. యష్ నటించిన టాక్సిక్ సినిమాకు కేవలం 0.5 స్టార్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్‌కు కూడా 0.5 స్టార్ మాత్రమే ఇచ్చాడు. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాకు 2.5 స్టార్స్










