పొరపాటున కూడా మైక్రోవేవ్ లో వేడి చేయకూడని ఆహార పదార్థాలు
కొందరు ఉడకబెట్టిన గుడ్లు చల్లారితే.. వాటిని వేడి చేసి తింటూ ఉంటారు. అయితే ఉడికించిన గుడ్డును దాని పెంకుతో పాటు మైక్రోవేవ్లో ఎప్పుడూ మళ్లీ వేడి చేయకూడదు. గుడ్డు లోపల ఆవిరి పేరుకుపోవచ్చు, వేడిగా ఉన్న గుడ్డును బయటకు తీసి పగలగొడితే అది పేలే ప్రమాదం ఉంది. మీరు ఉడికించిన గుడ్డును వేడి చేయాలనుకుంటే, ముందుగా దాని పెంకు తీసి ముక్కలుగా కోసి, ఆ తర్వాత నెమ్మదిగా వేడి చేయండి. మైక్రోవేవ్లో గుడ్డు వంటకాలను వేడి చేస్తున్నప్పుడు అవి సమానంగా వేడెక్కేలా చూసుకోవడానికి వాటిపై మూత పెట్టండి, వాటిని తిప్పండి లేదా కలపండి. సాంబార్, గ్రేవీ, కూర, పాస్తా సాస్ వంటి చిక్కగా ఉండే ఆహారాల్లో మైక్రోవేవ్ వేడి ఒకేలా చేరకపోవచ్చు. ఒక చోట చల్లగా ఉంటే మరో చోట చాలా వేడిగా ఉండొచ్చు. అందుకే పాత్రను కవర్ చేసి కొద్దిసేపు వేడి చేసిన తర్వాత బయటకు తీసి బాగా కలపాలి. అవసరమైతే మళ్లీ కొద్దిసేపు వేడి చేయాలి. కొందరు పచ్చిమిర్చిని కట్ చేయకుండా దాన్ని అలానే వేడి చేస్తూ ఉంటారు. మొత్తం పచ్చిమిర్చిని మైక్రోవేవ్లో వేడి చేస్తే వాటిలోని క్యాప్సైసిన్ అధికంగా ఉండే నూనెలు ఆవిరైపోయి, కారం పదార్థం నుంచి వచ్చే ఆవిరి ముక్కు, కళ్లకు ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే మొత్తం మిర్చిని నేరుగా వేడి చేయకుండా చిన్న ముక్కలుగా కోసి కూర లేదా ఇతర ఆహారంలో కలిపి వేడి చేయడం మంచిది. అన్నం విషయంలో మైక్రోవేవ్ కంటే దాన్ని ఎలా నిల్వ చేశామన్నదే చాలా ముఖ్యం. ఉడికించిన అన్నాన్ని ఎక్కువసేపు బయట ఉంచితే బ్యాసిల్లస్ సీరస్ అనే బ్యాక్టీరియా పెరిగి సమస్యలు కలిగించే టాక్సిన్లు తయారయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మైక్రోవేవ్లో వేడి చేసినా ఆ టాక్సిన్లు పూర్తిగా పోతాయని చెప్పలేము. అందుకే మిగిలిన అన్నాన్ని వీలైనంత త్వరగా ఫ్రిజ్లో పెట్టాలి. పకోడీలు, సమోసాలు, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి