
అయోధ్య రామ మందిర ఫస్ట్ ఇతడే? జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయనట్రాక్ రికార్డ్ ఇదే
అయోధ్య రామ మందిర తొలి సీఈఓగా జితేంద్ర మిశ్రా నియమాకం మాజీ ఎయిర్ మార్షల్ మిశ్రా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా? 38 ఏళ్ల వైమానిక దళ అనుభవం.. ఇప్పుడు రామ మందిర సీఈఓగా Air Marshal Jeetendra Mishra : అయోధ్యలోని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనిలో మహంత్ నృత్య గోపాల్ దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జితేంద్రతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి రాజేష్ పాండే, మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ చంద్ర కూడా ఈ పదవి కోసం పోటీపడగా ట్రస్ట్ మాత్రం జితేంద్రను సీఈఎంగా ఫైనల్ చేసింది. ఈ సమావేశానికి ట్రస్ట్ సీనియర్ కార్యవర్గ సభ్యులు, ఆహ్వానిత సభ్యులు హాజరయ్యారు. అంతేకాదు.. అయోధ్యకు చెందిన సీనియర్ న్యాయవాది మదన్ మోహన్ పాండే; ఢిల్లీకి చెందిన మహేష్ భగచంద్కా, అయోధ్యకు చెందిన నిర్మలా యాదవ్‌లతో సహా ముగ్గురు కొత్త సభ్యుల నియామకాన్ని కూడా ట్రస్ట్ ప్రకటించింది. 4 దశాబ్దాల అనుభవం : జితేంద్ర మిశ్రా కేవలం సాధారణ పరిపాలనా అధికారి కాదు. ఆయన భారత వైమానిక దళంలో దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ అధికారి. 1986 డిసెంబర్ 6న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో పైలట్‌గా నియమితులయ్యారు. ఫైటర్ కంబాట్ లీడర్, టెస్ట్ పైలట్‌గా కూడా సేవలందించారు. అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీకి కూడా ఆయన పూర్వ విద్యార్థి. Read Also : Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. లాటరీలో ఎంపికైన వారికి అసలు పరీక్ష ఇప్పుడే! ఎయిర్ పోర్స్ కెరీర్లో మిగ్-21 స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ కూడా. టెస్ట్ పైలట్స్ స్కూల్లో సీనియర్ టెస్ట్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, హెచ్ఎఎల్ చీఫ్ టెస్ట్ పైలట్, ఫ్లయిట్ అప్‌గ్రేడ్ ప్రాజెక్టుల

