© 2026 nimisham.in

తుది దశకు చేరిన వంశధార జలాశయ ప్రాజెక్టు పనులు ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్టుడే హిరమండలం: వంశధార జలాశయాన్ని రూ.419.23 కోట్లతో ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.414.69 కోట్లు ఖర్చు చేశారు.
గడిచిన కాలంలో జలాశయం 7 కిలోమీటర్ల పొడవునా ఎర్త్ బండ్ పూర్తి చేశారు. హైలెవెల్ కెనాల్ స్లూయిజ్, లింక్ కెనాల్ హెడ్ స్లూయిజ్, మట్టి, కాలువ పనులు, రెగ్యులేటరు పూర్తి చేశారు. 2019లో ప్రభుత్వం మారడంతో అప్పట్లో పనులు నిలిచిపోయాయి.
2014-19 సంవత్సరంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా హయాంలో పూర్తిగా పక్కన పెట్టేశారు. గుత్తేదారు సంస్థకు బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.26 కోట్లు బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించేలా చేశారు. రెండేళ్లలో తొమ్మిది శాతం పనులు పూర్తి చేసింది.
సబ్సిడరీ బండ్ 1.6 కి.మీ, స్పిల్వే గేట్ల నిర్మాణ పనులు 30 శాతం జరగాలి. జలాశయం పైభాగంలో పారాపెట్ వాల్ నిర్మాణం 10 శాతం చేయాలి. వీటిని పూర్తి చేస్తే పనులు పూర్తయినట్లే. ప్రస్తుతం 12 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. సైడ్వియర్ ద్వారా ఎనిమిది టీఎంసీల వరకూ నీరందించవచ్చు.
సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వంలో ఊపిరిపోస్తున్నాం. గత ఐదేళ్లు వైకాపా సర్కారు వీటిని నిర్వీర్యం చేసింది. సాగునీటి వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. వంశధార జలాశయం పనులు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలనుకున్నాం. కానీ గడువుకంటే ముందుగానే జాతికి అంకితం చేస్తాం. కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర మంత్రి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.