© 2026 nimisham.in

6.67-అంగుళాల HD LCD డిస్ప్లే అదుర్స్ 64MP ప్రైమరీ కెమెరా, 5,700mAh బ్యాటరీ అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ కొనేసుకోవచ్చు Philips S7221 5G Launch : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా?
ఫిలిప్స్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త ఖతర్నాక్ ఫోన్ వచ్చేసింది. అదే.. ఫిలిప్స్ S7221 5జీ.. ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,700mAh బ్యాటరీ ఉంది. 64MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ (Philips S7221 5G Launch) అందిస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫిలిప్స్ S7221 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.. ధర ఎంతంటే? : ఫిలిప్స్ S7221 5జీ స్మార్ట్‌ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,499 కాగా, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, యాష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఫిలిప్స్ S7221 5జీలో 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD LCD డిస్ప్లే ఉంది. ఆక్టా-కోర్ స్ప్రెడ్ట్రమ్ T765 చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB LPDDR4 ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. Read Also : Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..! ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,700mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ కొలతలు 166mm పొడవు, 77mm వెడల్పు, 8.95mm మందం, బరువు 200 గ్రాములు ఉంటుంది. కెమెరా సెటప్ పరంగా.. ఫిలిప్స్ S7221 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 64MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా ఉంది. కెమెరా ఫీచర్లలో ఏఐ సీన్ ఆప్టిమైజేషన్ పోర్ట్రెయిట్ మోడ్ ఉన్నాయి. ఈ ఫోన్లో హై ఆడియో అవుట్‌పుట్ కోసం అల్ట్రా మాక్స్ మోడ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ నానో సిమ్, 5G, Wi-Fi, GPS, GLONASS, గెలీలియో, బీడౌ, బ్లూటూత్ USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం పక్కన ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.