© 2026 nimisham.in

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని తాకాయని, ఇది ముఖ్యమంత్రి, అపర భగీరథుడు చంద్రబాబు దార్శనికత వల్లే సాధ్యమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు...
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని తాకాయని, ఇది ముఖ్యమంత్రి, అపర భగీరథుడు చంద్రబాబు దార్శనికత వల్లే సాధ్యమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీరు చేరడం రాష్ట్ర జలవనరుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని ఆయన అభివర్ణించారు. బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు హారతి పట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నిమ్మల రామానాయుడు మాట్లాడారు.పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకముందే, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు నీరందించాలన్న చంద్రబాబు ముందుచూపు వల్లే ఈరోజు ఈ ప్రాంత ప్రజల దాహం తీరుతోందని మంత్రి అన్నారు. "2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, 2026 నాటికి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా పూర్తి చేసి ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చాం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండేళ్ల కాలంలోనే ఏలేరు, పంప, తాండవ, శారద, వరాహ వంటి ఐదు ప్రధాన నదులను, తొమ్మిది జాతీయ రహదారులను దాటుతూ కెనాల్ నిర్మాణంలో ఉన్న క్లిష్టమైన పనులను పూర్తి చేశామని తెలిపారు. కొమ్మరిలోవ వద్ద 100 మీటర్ల లోతైన కొండను తవ్వి కాలువను తీసుకురావడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల తీవ్ర