© 2026 nimisham.in

30 ఏళ్లలో 12% తగ్గిన గ్లేసియర్ల వైశాల్యం ‘ఆసియా వాటర్స్’పై ఆధారపడిన 200 కోట్ల మంది భద్రతకు ప్రమాదం హిందూకుష్ హిమాలయాలపై ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక ఈనాడు, హైదరాబాద్: హిందూకుష్ హిమాలయ పర్వత...
30 ఏళ్లలో 12% తగ్గిన గ్లేసియర్ల వైశాల్యం ‘ఆసియా వాటర్స్’పై ఆధారపడిన 200 కోట్ల మంది భద్రతకు ప్రమాదం హిందూకుష్ హిమాలయాలపై ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
ఈనాడు, హైదరాబాద్: హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే 24 కోట్ల మందితోపాటు దిగువన దాదాపు 175 కోట్ల మంది ప్రజల తాగు, సాగునీటి అవసరాలను హిమానీనద సరస్సులే(గ్లేసియర్ లేక్స్) తీరుస్తున్నాయి. గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి 12 ‘ఆసియా వాటర్స్’ నదుల ద్వారా ప్రజల ఆహారభద్రతతోపాటు జలవిద్యుత్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. అటువంటి హిమానీనదాలు వేగంగా కరుగుతుండటంతో భవిష్యత్తుపై ఆందోళనలు కమ్ముకుంటున్నాయి. 2011 నుంచి 2020 మధ్యకాలంలో హిందూకుష్ హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు, దానికి మునుపటి దశాబ్దంతో పోలిస్తే 65% వేగంగా కరిగిపోయాయి. భూగోళ ఉష్ణోగ్రతలు, ఉద్గారాల ప్రవాహం ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి హిమాలయాల్లోని మంచులో 80% కరిగిపోయే అవకాశం ఉందని నేపాల్లోని కాఠ్మాండూ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) హెచ్చరించింది. వేల సంవత్సరాల నాటి హిమానీనదాలు వేగంగా కరిగితే ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో.. తాజాగా నేపాల్లో ఉప్పొంగిన మంచు సరస్సులే నిదర్శనమని తెలిపింది. గత 30 ఏళ్ల(1990 నుంచి 2020)లో హిమానీనదాల వైశాల్యం 12%(7300 చ.కి.మీ.) తగ్గిందని, నీటి నిల్వలు, మంచు పరిమాణంలో 9% క్షీణత నమోదైందని ఐసీఐఎంఓడీ తన పరిశోధన నివేదికలో వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.