© 2026 nimisham.in

టాలీవుడ్లో రాబోయే అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో నాని నటిస్తున్న ది ప్యారడైజ్(The Paradise) ఒకటిగా నిలుస్తోంది.
నాని(Nani) కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలున్నాయి. రిలీజ్ ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. నాన్ థియేట్రికల్ డీల్ ద్వారా కొంత పెట్టుబడి తిరిగి వచ్చినప్పటికీ, అసలు ఛాలెంజ్ మాత్రం థియేట్రికల్ మార్కెట్లోనే ఉండబోతోంది.
ఇప్పటివరకు నాని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఈ స్థాయి భారీ బడ్జెట్‌ను రికవర్ చేయాలంటే ఇతర భాషల్లో కూడా సినిమా సత్తా చాటాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్లలో మంచి కలెక్షన్లు సాధించడం కీలకం కానుంది. గతంలో నాని తన సినిమాలను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసినప్పటికీ, తెలుగు కాకుండా ఆశించిన స్థాయి కమర్షియల్ ఫలితాలు మాత్రం రాలేదు. దీంతో ది ప్యారడైజ్ నానికి కొత్త మార్కెట్‌ను తెరిచే సినిమాగా మారుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. కయాదు లోహర్(Kayadhu Lohar) హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ పెట్టుబడి, పెరిగిన అంచనాలు, పాన్ ఇండియా టార్గెట్‌తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ నాని కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. తెలుగు మార్కెట్‌ను దాటి ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగితేనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు నిజమైన కమర్షియల్ సక్సెస్ దక్కే అవకాశం ఉంది.