© 2026 nimisham.in

Chittoor: చిత్తూరులో పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు: భారీ స్కూటర్ ర్యాలీ! చిత్తూరు: డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిత్తూరులో జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర కార్యదర్శి అరణి కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా చిత్తూరు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి మురకంబట్టు వరకు సాగిన ఈ ర్యాలీకి చిత్తూరు జనసేన సీనియర్ నాయకులు పగడాల శశికాంత్ నాయకత్వం వహించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు చేతబట్టి పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు.
అలాగే చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం నుంచి సుమారు 100 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వేడుకలకు తరలివచ్చారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం జనసేన శ్రేణులతో సందడిగా మారింది.