© 2026 nimisham.in

Car Sales: భారతీయ కార్ల మార్కెట్లో ఆగస్టు 2026 నెల సరికొత్త చరిత్రను తిరగరాసింది. పండుగల సీజన్ కంటే ముందే కస్టమర్లు కార్లను విపరీతంగా కొనుగోలు చేయడంతో మారు
తి సుజుకి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, మహీంద్రా, టాటా మోటార్స్ కంపెనీలు ఊహించని రీతిలో భారీ వృద్ధిని నమోదు చేసి సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి.
దేశీయంగా అత్యధిక కార్లు విక్రయించే దిగ్గజం మారుతి సుజుకి ఆగస్టు నెలలో 2,19,220 వాహనాలను అమ్మి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశీయ మార్కెట్లో 1,80,078 ప్యాసింజర్ వాహనాలను విక్రయించడమే కాకుండా, విదేశాలకు 33,844 యూనిట్లను ఎగుమతి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లోనే ఏకంగా 10 లక్షల వాహనాల మార్కును దాటేసి తన బలాన్ని నిరూపించుకుంది. గతేడాది ఆగస్టులో 1,31,278 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 1,76,971 కి చేరింది.
మహీంద్రా ఎస్‌యూవీల దాటికి సరికొత్త రికార్డు
మహీంద్రా కంపెనీ విక్రయాలు ఆగస్టు నెలలో ఏకంగా 42 శాతం వృద్ధి చెంది 1,07,648 వాహనాలకు చేరాయి. ఈ ఘనతలో కంపెనీ ఎస్‌యూవీల వాటా అత్యంత ముఖ్యం. గతేడాది ఆగస్టులో 39,399 ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడవగా, ఈసారి 50 శాతం వృద్ధితో 59,257 యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 61,167 యుటిలిటీ వాహనాలను అమ్మి మార్కెట్‌ను ఊపేసింది.
టాటా మోటార్స్ ఆగస్టు నెలలో 67,753 ప్యాసింజర్ వాహనాలను అమ్మి గతేడాది కంటే 56 శాతం భారీ వృద్ధిని సొంతం చేసుకుంది. ఇందులోనూ ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు అగ్రభాగాన నిలిచాయి. కంపెనీ ఒకే నెలలో 16,549 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి ఏకంగా 94 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయంగా పెట్రోల్, డిజైన్ తో పాటు ఈవీల వైపు ప్రజలు చూపిస్తున్న ఆసక్తికి టాటా మోటార్స్ గణాంకాలే ప్రధాన ఉదాహరణ.
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆగస్టు నెలలో 65,796 వాహనాలను విక్రయించి 8.8 శాతం వృద్ధిని నమోదు చేయగా, దేశీయ అమ్మకాలు 54,396 యూనిట్లతో సరికొత్త ఆల్‌టైమ్ రికార్డును సాధించాయి. మరోవైపు కియా ఇండియా ఏకంగా 48.1 శాతం సంచలన వృద్ధితో 29,042 కార్లను విక్రయించింది. భారతదేశంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి కియాకు ఆగస్టు నెలలోనే అత్యధిక విక్రయాలు నమోదు కావడం విశేషం.
2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్సైట్లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.