© 2026 nimisham.in

Karimnagar: పోగొట్టుకున్న ఫోన్ను బాధితుడికి అందించిన కరీంనగర్ పోలీసులు! Karimnagar: కరీంనగర్ రూరల్, దుర్షేడ్ గ్రామానికి చెంది
న కొల్లూరి అంజయ్య అనునతడు గత సంవత్సరం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ లో తన యొక్క ఐక్యు సెల్ ఫోన్ పోగొట్టుకొనగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు.
పోలీసులు సి.ఈ.ఐ.ఆర్ టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను ట్రేస్ చేసి పెద్దపల్లి లో పట్టుకోవడం జరిగింది. అట్టి ఫోను యజమాని అయిన కొల్లూరి అంజయ్య కు ఇన్స్పెక్టర్ ఏ.నిరంజన్ రెడ్డి సెల్ ఫోను ను అందజేశారు. సెల్ ఫోన్ ను ట్రేస్ చేయడంలో కృషి చేసిన టెక్ టీం కానిస్టేబుల్ చిట్యాల రాంసాయి మరియు ఫైజాన్ లను సిఐ ఏ. నిరంజన్ రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు కూడా విలువైన వస్తువులను అజాగ్రత్తగా పర వేసుకోకూడదని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొరపాటున అజాగ్రత్తగా ఏదైనా విలువగల వస్తువులను పోగొట్టుకొనిన, దొంగిలించబడ్డ వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని తెలిపారు.