
నాకు టెస్ట్క్రికెట్ అంటే చాలా ఇష్టం
దులీప్ ట్రోఫీ2026లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్ జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ2026లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. నార్త్ జోన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టును విజయపథంలో నడిపించిన తిలక్ వర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్రజంటేషన్ సందర్భంగా తిలక్ వర్మ టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రెడ్ బాల్ క్రికెట్ ఆడడాన్ని ఎంతో ఇష్ట పడుతా. నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. వైట్‌బాల్ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని నేనెప్పుడు కల కనలేదు. అదంతా దేవుడే ప్లాన్ చేశాడని భావిస్తున్నాను. తొలుత టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నేను తర్వాత వన్డే క్రికెట్ కూడా ఆడాను. కానీ టెస్ట్ క్రికెట్లో నా బలాన్ని నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నా' అని తిలక్ పేర్కొన్నాడు. 'ఎప్పటికైనా భారత టెస్టు క్రికెట్ జట్టులో ఆడాలన్నదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఐపీఎల్ కారణంగా వైట్‌బాల్ క్రికెట్లో టీమిండియాకు ఎంపికయ్యాను. కానీ ఐపీఎల్‌కు రాకముందే రెడ్ బాల్ క్రికెట్లో చాలా కష్టపడ్డాను. అందుకే టెస్టు క్రికెట్ ఆడడాన్ని ప్రేమించడంతో పాటు ఎంజాయ్ చేస్తాను. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటున్నప్పటికీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా అదీ జరగడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే టెస్ట్ క్రికెట్లో వీలైనంత మేర రాణించాలని భావించాను' అని తిలక్ వెల్లడించాడు. కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్